WNP: మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకద్ర శాసనసభ్యులు జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.