NZB: ప్రజాసేవకు అంకితమైన భారత ప్రభుత్వ తపాల శాఖ నేతృత్వంలో పవిత్ర గంగా జలాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆర్మూర్ పోస్ట్ మాస్టర్ కిషన్ నాయక్ తెలిపారు. హిందూ సంప్రదాయంలో ప్రజలు గంగాజలాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. రిషికేశ్, సూదూర ప్రాంతాలకు వెళ్లలేని ప్రజలకు భారత ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం గంగా జలాలు అందజేస్తుందన్నారు. ఒక బాటిల్ ధర రూ.30 ఉంటుందన్నారు.