కృష్ణా: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. శనివారం పెదపారుపూడి(M) చిన్నపారుపూడి గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ నరేష్ ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పామర్రు TDP ఆఫీసులో చప్పిడి కిషోర్ P4 పథకం ద్వారా రూ.50,000ను ఎమ్మెల్యే చేతుల మీదుగా నరేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.