MBNR: దేవరకద్ర నియోజకవర్గ మూసాపేట మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన చెన్నకేశవ స్వామి జాతరకు దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షించానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.