KMR: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడతామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. శనివారం కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన భక్తులతో మాట్లాడారు. ప్రాచీన, మహిమాన్విత చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి భక్తులు ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.