MDCL: అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఇవాళ జలమండలి జీఎం హరిశంకర్ వద్దకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా సబ్దర్ నగర్, కేఎస్ నగర్, జేకే పాయింట్, హరి నగర్, గాయత్రీ నగర్, తులసి నగర్ తదితర ప్రాంతాల్లోని భూగర్భ డ్రైనేజీ సమస్యలు & జనప్రియ నగర్లో కలుషితమైన నీటి సమస్యపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.