NLG: ధరణి పోయి భూభారతి చట్టం వచ్చిన రైతుల సమస్య పరిష్కారం కాలేదు అని సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూభారతి చట్టం అనే కొత్త చట్టం తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అదనంగా అధికారులను పెంచిన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు అని ఆరోపించారు. వెంటనే భూభారతి చట్టంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.