ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపిన 3,124 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.