VKB: తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిన చారిత్రాత్మక రోజు దీక్షా దివస్ అని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మెతకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.