HYD: నగరంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణంగా నవంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. కానీ, ఇటీవల కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో చిన్నపిల్లు, వృద్దులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.