వరంగల్: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 2K రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) వరకు 2K రన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ తానాజీ వాకాడే అధికారులు తదితరులు పాల్గొన్నారు.