SRD: భర్తతో గొడవపడి గృహిని అదృశ్యమైన సంఘటన పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామానికి చెందిన సరళ(30) భర్తతో గొడవ పడి ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. తిరిగి రాకపోవడంతో భర్త పొల్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కెసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి తెలిపారు.