NZB: సమాజ సేవ, ధర్మప్రచారం, దేశభక్తి మార్గంలో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా అన్నారు. బుధవారం నిజామాబాద్లో నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ శ్రేయోభిలాషుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ ధర్మ మార్గంలో నడవాలని సూచించారు.