ASF: రెబ్బెన మండలం గోలేటిలో శనివారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడా మైదానం ఇందుకు ముస్తాబైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 240 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.