HYD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లో జరిగే 19వ ఆటా మహాసభలకు హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. కేటీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, శరత్ వేముల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయుల పరిస్థితులపై చర్చించారు.