MLG: రెండు ఆటోలు ఎదురుగా ఢీకొని పలువురికి గాయాలైన ఘటన మంగపేట మండలంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళ్తే.. మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ పెరకలకుంట సమీపంలో 2 ఆటలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడ్డవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.