SRCL: హరితహారం కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని వాహనాల ఫిట్నెస్ నిర్వహించే స్థలంలో రవాణా అధికారులు శుక్రవారం సుమారు 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ వాహనాల తనిఖీ అధికారి మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.