PDPL: పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల ఉపవాసాల అనంతరం వచ్చే ఈద్-ఉల్-ఫితర్ పండుగను కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. తెలంగాణ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం అని, రంజాన్ ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు.