SDPT: వర్గల్ మండలం నాచారంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆలయ ఈవో రంగాచారి, ధర్మకర్తలు నాయకం శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, గాలి కిష్టయ్య పాల్గొన్నారు.