HYD: తెలంగాణ పోలీసు శాఖ చర్యలతో మావోయిస్టు, ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని, ఇటీవల కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారని, అలాగే మిగిలివారు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి తెలంగాణ పునర్నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలన్నారు.