NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాలకు పెద్ద పీట వేస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. శుక్రవారం కమ్మర్ పల్లి మండలంలోని కొత్త చెరువు తాండా, కోన సమందర్, ఇనాయత్ నగర్, బషీరాబాద్ గ్రామాల్లో ఐకేపీ డీఆర్డీఏ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.