KMM: జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కలెక్టరేటు లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. అర్జీలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.