పెద్దపల్లి జిల్లాలో డి 83 మరియు డి 84 కాలువల ద్వారా ఎస్సారెస్పీ నుంచి ఏప్రిల్ 8 వరకు సాగునీరు విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 31 డిసెంబర్ 2025 నుంచి 8 ఏప్రిల్ 2026 వరకు 7 తడులలో నీరు విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఒక్కో తడి 8 రోజులు వస్తాయని తెలిపారు. నీరు వృధా చేయకుండా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.