WGL: పర్వతగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు పోస్టింగ్ ద్వారా వచ్చినా, రవాణా ఇబ్బందులతో నగరాలకు డిప్యూటేషన్ వేసుకుని పనిచేస్తున్నారు. దీంతో విద్యార్థుల నిష్పత్తికి ఉపాధ్యాయులు లేక, పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమ డిప్యూటేషన్ల పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు చర్యలు తీసుకోవాలని శనివారం కోరారు.