SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో చిన్నారి విద్యాపీఠం స్కూల్‌ను ప్రారంభించి ఆమె మాట్లాడారు. పాఠశాలను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో నడపాలని ఆమె సూచించారు.