PDPL: రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బీ.రాజేశ్వరరావు మానవత్వాన్ని చాటుకున్నారు. గోదావరిఖని మున్సిపల్ టీ-జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన రాజేశ్వరరావు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు.