NGKL: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఈనెల 15న జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవలన్నారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’ అని పేర్కొంటూ, కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.