NZB: ఎన్నికల సందర్బంగా ర్యాలీలు నిర్వహించాలి అంటే సంబందించిన అధికారుల అనుమతి తప్పనిసరి అని, డి.జేలు పూర్తిగా నిషేధం విదిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుక్రవారం తెలిపారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలి అనుకుంటే సంబందించిన రిటర్నింగ్ అధికారికి లేదా పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు.