MBNR: నవాబ్ పేట మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 213 సర్పంచ్, 818 వార్డులకు నామినేషన్లు ఆమోదం పొందినట్లు సహాయ ఎన్నికల అధికారి జయరాం నాయక్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 29, సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను వచ్చే నెల 3న ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.