విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 5 నుంచి 15 వరకు 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం పోటీలు జరిగే వుడా పార్క్, శివాజీ పార్క్, కైలాసగిరి, బోయపాలెం వేదికలను పరిశీలించారు. స్పీడ్, హాకీ, ఆల్ఫైన్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.