VKB: భూమికి భూమి ఇవ్వాలని.. లేకుంటే తమ అసైన్డ్ పట్టా భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్పారు. శనివారం పరిగి మండలం రంగాపూర్‌లో కేటాయించిన అసైన్డ్ భూమిలో ఎలాంటి ప్రభుత్వ నిర్మాణ పనులు చేయకూడదని, తమ భూములకు భూములు కేటాయిస్తేనే భూములు ఇస్తామన్నారు. తమ ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని తెలిపారు. అధికారులు ఎక్కడైనా తమకు భూములు చూపించాలని కోరారు.