PDPL: పెద్దపల్లి యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నవంబర్ 11న 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువజన ఉత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సురేష్ తెలిపారు. జానపద నృత్యం, గేయం, కథారచన, పెయింటింగ్, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పారు. ఆసక్తిగల యువతీ, యువకులు పాల్గొనాలన్నారు.