WGL: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మట్టి గణపతులను పూజించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. 5వ డివిజన్ రెడ్డి కాలనీ, 54వ డివిజన్ జాగృతి కాలనీలలో శనివారం గణపతి ఆగమన్ శోభయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.