HYD: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పోలీసులు సూచనలు చేశారు. ప్రతిరోజు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉంటుందని, సాధ్యమైనంత వరకు ప్రజారవాణా మార్గాల్లోనే దర్శనానికి రావాలన్నారు. సొంత వాహనాల్లో వస్తే పార్కింగ్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని, 60 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.