WNP: మదనపురంలోని ఊక చెట్టు వాగుపై నిర్మించిన బ్రిడ్జిని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, ఇరువైపులా అప్రోచ్ రోడ్ల కోసం రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.5 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అప్రోచ్ మట్టి వేయగానే బ్రిడ్జిని ప్రారంభిస్తామని వెల్లడించారు.