BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ నూతన సర్పంచ్ సునీత-రవీందర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇవాళ గ్రామంలోని 5వ వార్డులో చేతి పంపును తొలగించి బోర్ మోటార్ ప్రారంభించారు. వార్డు మెంబర్ కాడపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి సమస్యను సర్పంచ్ సహాయంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.