WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మూడు రోజులుగా ట్యాంకర్ ద్వారా గానీ, మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా గానీ మంచినీటి సరఫరా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్యపై చర్యలు తీసుకోకపోవడంతో శుక్రవారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తాం అన్నారు.