KNR: కరీంనగర్లోని పద్మశాలి భవన్లో జరిగిన సమావేశంలో బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడారు. స్వాతంత్య్రం నాటి నుంచి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్యాయం జరుగుతోందని, రాజ్యాధికారం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.