BDK: అశ్వరావుపేటలో నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకటన ద్వారా తెలిపారు. ముందుగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు పంపిణీ చేస్తారని అన్నారు. అనంతరం వేలూరుపాడుకు నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.