RR: షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రేపు కొందుర్గు మండలంలోని అయోధ్య పూర్ తండాలో అభయ ఆంజనేయస్వామి దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం వెంకిర్యాల గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీటీసీ సభ్యులు మాసయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.