JN: దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజల వైద్య ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.