RR: షాద్ నగర్ మున్సిపల్ పరిధి ఏడవ వార్డు హైటెక్ కాలనీవాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్డులు లేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.