JN: ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వడదెబ్బ తగలకుండా అధికారులు చూసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. లింగాల గణపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. జన సంద్రం ఉండే చోట చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండలానికి సరిపడా ORS ప్యాకెట్స్, మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.