KMM: నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించి పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు తన్నీరు కృష్ణార్జునరావు కోరారు. ఈ మేరకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతిపత్రం అందించారు. పాత ఆస్పత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఒక్కో బెడ్ పై ఇద్దరు, ముగ్గురు ఉండాల్సి వస్తుందన్నారు.