MNCL:జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సబ్ కలెక్టర్ మనోజ్, తహసిల్దార్ కృష్ణలతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.