HYD: నగర జలమండలి AI ఉపయోగించటంతో కీలక వివరాలను సాంకేతికత పసిగట్టేసింది. ట్యాంకర్ల బుకింగ్ వివరాల్లో ఏఐ ఉపయోగించగా, అత్యధిక ట్యాంకర్లు బుక్ చేసిన మొదటి 10 మందిని గుర్తించింది. అందులో అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన ప్రాంతాలలో ప్రగతినగర్‌లోని సౌతన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఉంది. గత సంవత్సరంలో ఇక్కడ 674 ట్యాంకర్లను బుక్ చేసినట్టు తేల్చారు.