KNR: మాత, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తుంది. శంకరపట్నం మండలం మెట్పల్లి పల్లె దవఖానాలో పోషణ్ అభియాన్ పేరిట శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందు, సీడీపీవో శ్రీలత హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు,బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం,చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించారు.