KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అనిల్, ప్రవీణ్, అర్చన, సాయితేజలు జిల్లాస్థాయిలో సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈనెల 27-29 తేదీలలో మెదక్ జిల్లాలో రాష్ట్రస్థాయి సీఎం పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సరిత తెలిపారు. సరిత మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో గెలుపొంది మోడల్ స్కూల్ ప్రతిభను చాటాలన్నారు.