KNR: భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఎస్ఎఫ్ఏ, డీవైఎఫ్ఎ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘టూకే రన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు.