Tspsc paper leak కేసులో నలుగురి అరెస్ట్.. కొశ్చన్ పేపర్స్ ఎలా కొనుగోలు చేశారంటే?
Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ (paper leak) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడిగా పనిచేసే తిరుపతయ్యను (tirupataiah) పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరొ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ (paper leak) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలంలో రేణుక (renuka), ఆమె భర్త డాక్యా నాయక్ (daakya naik), రాజేంద్రకుమార్ (rajendra kumar), గోపాల్ (gopal), నీలేష్ (neelesh), శ్రీనివాస్‌ను (srinivas) ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడిగా పనిచేసే తిరుపతయ్యను (tirupataiah) పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరొ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనిది గండీడ్ మండలం సల్కర్ పేట్ అని పోలీసులు తెలిపారు. ఓకే ప్రాంతం నుంచి ఈ స్థాయిలో ఉండటం లీకేజ్ కేసు చర్చకు దారితీసింది.
డాక్యా నాయక్, రాజేంద్రకుమార్ గోపాల్, నీలేష్‌తో నవాబ్ పేట, షాద్ నగర్‌కు చెందిన ప్రశాంత్ రెడ్డి, రాజేంద్ర కుమార్ లాడ్జీలో (lodge) కలిశారట. వీరు ఏఈ కొశ్చన్ పేపర్ (ae question paper) కొనుగోలు చేశారని తెలిసింది. డాక్యా, రేణుక కూడా విచారణలో ఇదే అంశం రుజువవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారట.. రూ.10 లక్షల వరకు చెల్లించాలని సిట్ అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యవర్తిగా వ్యవహరించిన సల్కర్ పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు (tirupataiah) మరో ముగ్గురిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతయ్య, ప్రశాంత్, రాజేంద్రకుమార్.. ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు ఏఈ కొశ్చన్ పేపర్ విక్రయంలో దళారిగా వ్యవహరించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. నిన్న 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. వీరితో ఇప్పటివరకు 50 మందిని విచారించినట్టు అయ్యింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో గల నేరేళ్ల చెరువు రాజేంద్ర కుమార్ స్వగ్రామం. ఇతని పేరంట్స్ లక్ష్మయ్య, లక్ష్మీ దేవమ్మ కాగా.. పెద్ద కుమారుడు రాజేంద్ర కుమార్. ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. సర్కార్ కొలువు కోసం సిటీలో శిక్షణ తీసుకుని.. అడ్డదారిని ఎంచుకున్నాడు. బంగారం అమ్మి.. రూ.5 లక్షలు అప్పు చేసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. ఇప్పుడు అడ్డంగా దొరికేశాడు. ఇటు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను పోలీసులు ఆదివారం చంచల్ గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. 8 గంటల పాటు ప్రశ్నించి.. రాత్రి సిట్ ఆఫీసు నుంచి సీసీఎస్‌కు తరలించారు. ఈ రోజు, రేపు కూడా వారిని విచారిస్తారు.